Monday, December 23, 2024

అంతర్నాళాల్లో రక్తం గడ్డకడితే…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అంతర్నాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని డీప్ వెయిన్ త్రోంబోసిస్ (deep vein thrombosis (dvt) ) అని అంటారు. కాళ్లలో ఉన్న అంతర్నాళాల్లోని రక్తం గడ్డకట్టడం ఈ వ్యాధి లక్షణం. దీనివల్ల ప్రమాదకరమైన డివిటి అనే వ్యాధి వస్తుంది. అరవై ఏళ్లు పైబడినవారికి ఎవరికైనా ఈ వ్యాధి రావచ్చు. దేశంలో ఈ వ్యాధి రేటు 8 శాతం నుంచి 20 శాతం వరకు ఉంది. ఈ వ్యాధి ప్రధాన లక్షణం కాలి వాపు. అరుదుగా రెండు కాళ్లల్లో ఈ వ్యాధి వస్తుంది. కాలిలో నొప్పి, కాలిపై చర్మం ఎరుపురంగు తేలడం, కాలిలో వెచ్చదనం అనుభూతి కలగడం తదితర లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాలను నిర్లక్షం చేస్తే గడ్డకట్టిన రక్తపు గడ్డలు రక్తప్రసరణతోపాటు ప్రయాణించి ఊపిరితిత్తులకు చేరి అక్కడ అడ్డుగా తయారై పల్మనరీ ఎంబోలిజం ( pulmonary embolism ) అనే ప్రమాదకరమైన పరిస్థితిని కలిగిస్తాయి. పల్మోనరీ ఎంబోలిజం అంటే ఆకస్మికంగా శ్వాసలో ఇబ్బంది ఎదురుకావడం, పొడి శ్వాస, దగ్గు, ముడిపడిన ఛాతీ నొప్పి వస్తాయి.

మైకం కలుగుతుంది. నాడి వేగంగా కొట్టుకుంటుంది. దగ్గినప్పుడు రక్తం పడుతుంది. నరాల్లో రక్త ప్రవాహాన్ని అడ్డుకునే ఏదైనా సరే డివిటి వ్యాధి లేదా అంతర్నాళాల్లో రక్తం గడ్డకట్టే వ్యాధికి కారణమవుతుంది. సిరకు గాయం కావడం, శస్త్రచికిత్స అవసరం, క్యాన్సర్ , గుండె జబ్బులు వంటి వాటికి దారి తీయడం వంటివి జరుగుతాయి. కొందరికి వంశపారంపర్యంగా కూడా ఈ వ్యాధి వస్తుంది. గర్భిణులకు, గర్భనిరోధక మాత్రలు వాడిన వారికి, ఊబకాయులకు, దూమపానం చేసే వారికి కూడా ఇది రావచ్చు. ఈ రోగ నిర్ధారణ ప్రధానంగా రోగి యొక్క వైద్య చరిత్ర బట్టి బయటపడుతుంది. వ్యాధి సోకిన అంగం శారీరక పరీక్షచేస్తే ఇది తెలుస్తుంది,. డిడైమర్ పరీక్ష, అల్ట్రాసౌండ్, వేనోగ్రఫీ (vanography), సిటి స్కానింగ్, లేదా ఎంఆర్‌ఐ స్కానింగ్ , పల్మోనరీ ఆంజియోగ్రఫీ, ద్వారా రోగ నిర్ధారణ చేయవచ్చు. ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందాలంటే వాపు తగ్గాలి. రక్తాన్ని పలుచన చేసే ఏజెంట్లకు ప్రాధాన్యం ఉంటుంది. మంచంపై విశ్రాంతి తీసుకున్నప్పుడు అటూ ఇటూ తిరుగుతుండాలి. ఎక్కువ కాలం కూర్చుని ఉండకూడదు. నరాలు బిగుసుకుపోకుండా కాళ్ల కండరాలు కదిలేలా వ్యాయామం చేయడం అవసరం. శరీరం కదిలేందుకు వదులుగా ఉండే బట్టలు ధరించాలి. జీవనశైలి చురుకుగా ఉండాలి. రక్తాన్ని పలుచపరిచే మందుల్ని తీసుకుంటున్నప్పుడు శరీరంలో ఎక్కడైనా రక్తస్రావం జరుగుతోందా అన్నది పరిశీలించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News