మన తెలంగాణ,సిటీబ్యూరో: స్ట్రోక్ అనేది వైద్యపరంగా ఒక అత్యవసర పరిస్దితి సాధారణంగా 65 సంవత్సరాల దాటిన వారికి రక్త సరఫరాలో అంతరాయంతో మెదడు పాడవ్వడం కారణంగా కలుగుతుందని గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. గురువారం వరల్డ్ స్ట్రొక్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ యువతకు దీని వల్ల పొంచి ఉన్న ముప్పు గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, స్ట్రోక్ లక్షణాల్లో ఎక్కువగా మాట పోవడం, ముఖం వంకరపోవడం, శరీరంలో ఒకవైపు నీరసం లాంటి యువతో ఉంటాయి. చూపు తగ్గడం, రెండుగ కనబడటం, మాట ముద్దగా రావడం కళ్లు తిరగడం, నడవడంలో ఇబ్బంది ఉంటాయన్నారు. ఈసందర్భంగా ఎక్యూట్ కేర్ విభాగాధిపతి డా. స్వాతిరెడ్డి మాట్లాడుతూ త్వరగా చికిత్స చేయించకపోతే స్ట్రోక్‌తో ప్రాణాప్రాయం ఉంటుందని, శాశ్వతంగా నాడీ వ్యవస్ద దెబ్బతిని, జీవితం నాణ్యత గణనీయంగా పడిపోయి క్రమంగా మరణానికి దారి తీస్తుందన్నారు. కొందిరిలో వెంటనే మరణం సంభవిస్తుందని, స్ట్రోక్ వచ్చిన నాలుగు గంటల్లో రోగిని ఏదైనా ఆసుపత్రికి తీసుకెళ్లడం తప్పనిసరి చేయాలన్నారు. స్ట్రోక్ నివారణకు వ్యాయామం తప్పనిసరిగా, దీంతో రక్తనాళాల్లో రక్తసరఫరా సక్రమంగా జరిగి, గడ్డకట్టకుండా ఉంటుందని, స్ట్రోక్ కారణమయ్యే ఇతర వ్యాధులను నివారిస్తుంది. రోజు 30 నిమిషాలు వ్యాయామం రక్తనాళాల ఆరోగ్యానికి తప్పనిసరి. రోజు వ్యాయామం చేయలేకపోతే రాత్రిభోజనం తరువాత ఇంట్లోనైనా ఆరగంట నడవాలని సూచించారు.
తెలియకుండా స్ట్రోక్‌తో మరణిస్తున్న యువత: డాక్టర్ స్వాతిరెడ్డి
- Advertisement -
- Advertisement -
- Advertisement -