Wednesday, January 22, 2025

ఖేడ్ ఆర్టీసీ డిపోలో రక్తదానం

- Advertisement -
- Advertisement -

నారాయణఖేడ్ టౌన్: నారాయణఖేడ్ ఆర్టీసీ బస్‌డిపోలో ఎండి సజ్జనార్ ఆదేశాల మేరకు మంగళవారం ఆర్టీసీ డిపో మేనేజర్ మల్లేశయ్య ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని మోర్గి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రమేష్ బ్లడ్ డొనేషన్ క్యాంపు ప్రారంభించారు. కాగా ప్రభుత్వాసుపత్రి ల్యాబ్ ఇంచార్జి రాజేశ్వర్, సత్యం, లతా, స్నేహ, మోడల్ స్కూల్ లెక్చరర్స్ తో పాటు మరి కొంతమంది ఉద్యోగస్తులు ఈ శిబిరంలో రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి డిపో మేనేజర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ పీఆర్‌ఓ పాండు, శివశంకర్, భాస్కర్, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News