Monday, December 23, 2024

బోధన్ బస్టాండ్ ఆవరణలో రక్తదాన శిబిరం

- Advertisement -
- Advertisement -

బోధన్ : టిఎస్ ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండి విసి సజ్జనార్ ఆదేశాల మేరకు మంగళవారం బోధన్ బస్టాండ్ ఆవరణలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ డిఎంహెచ్‌వో హాజరై మాట్లాడారు. అన్ని దానాల్లో కెల్లా రక్తదానం ఎంతో గొప్పదని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తం ఎంతో అవసరం ఉంటుందని పేర్కొన్నారు. బోధన్ ఆర్టీసీ డిపోకు ఎందిన ఉద్యోగులు రక్తదానం చేశారు.

రక్తదానం చేసిన వారికి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, యుబిఐ బ్యాంకు వారు పండ్లు, పళ్ళ రసాలు, బిస్కెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎంఓ రహీం, డిపో మేనేజర్ టిఎస్ స్వామి, వెల్ఫేర్ బోర్డు మెంబర్స్ శ్రీనివాస్, సావిత్రి, అసిస్టెంట్ మేనేజర్ జనబాయి, అసిస్టెంట్ మేనేజర్ మెకానికల్ హరిప్రసాద్, బ్లడ్ బ్యాంక్ ఇంచార్జి షాజిదా, వైద్య సిబ్బంది, ఆర్టీసీ డిపో ఉద్యోగస్తులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News