Sunday, December 22, 2024

రక్తదానం మరొకరికి ప్రాణదానం: తలసాని

- Advertisement -
- Advertisement -

Blood donation can save up to 3 lives

హైదరాబాద్: దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రక్తదానం చేసిన 75 మంది దాతలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మెచ్చుకున్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా సనత్ నగర్ వెల్ఫేర్ గ్రౌండ్ లో రక్తదాన శిబిరాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా తలసాని మాట్లాడారు. రక్తదానం మరొకరికి ప్రాణదానం చేస్తుందన్నారు. అనేకమంది వీరుల త్యాగాల ఫలితంగానే విశాల భారతావని ఏర్పడిందని, స్వాతంత్ర్య పోరాట వీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ నెల 8 నుండి 22వ తేదీ వరకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో వజ్రోత్సవాలను నిర్వహిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News