Monday, December 23, 2024

అన్ని దానాల కన్న రక్తదానం చాలా గొప్పది

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్ ప్రతినిధి : అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని అత్యవసర సమయంలో రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలువాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆడిటోరియంలో ఆదివారం కిరణా, జనరల్ స్టోర్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంబించారు. ఈ సందర్బంగా రక్తదానం చేసిన రక్తదాతలను ఆయన అభినందించారు.

ప్రస్తుత తరుణంలో రక్తం అవసరం ఎక్కువైపోయిందని దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతీ ఒకరూ రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్త నిల్వలను పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి, డిఎం అండ్ హెచ్ నరేంధర్ రాథోడ్, ఆర్‌ఎంఓ చంపత్ రావు, వైద్యులు తిప్ప స్వామి, దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్, అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గణేష్, దాదా సాహెబ్ కిరణ, జనరల్ స్టోర్ వర్కర్స్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News