Wednesday, January 22, 2025

బ్లేడ్లు, కత్తులతో రక్తం చిందిస్తూ.. భువనగిరిలో మాతం ప్రదర్శన

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: మొహర్రం పండుగ 10వ రోజు సందర్భంగా షియా ముస్లిం సంఘం ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని జంఖానగూడెం హజ్రత్ అబ్బాస్ అశుర్‌ఖానా నుంచి ఖాజీమొహల్లలోని బీబీ కా ఆలం పీర్లచావడి వరకు శనివారం మాతం నిర్వహించారు. అదేవిధంగా హైదరాబాద్ చౌరస్తా కర్బలా మైదానం నుంచి జామా మసీద్ దర్గా కమాన్ వరకు, సమ్మద్ చౌరస్తా నుంచి భాజిమొహల్లా, జంఖాన్‌గూడెం మీదుగా దర్గాకమాన్ వద్ద షహజాదే ఖాసీం పీర్లచావడి వరకు మాతం నిర్వహించారు.

ఈ సందర్భంగా యువకులు బ్లేడ్లు, చిన్నచిన్న చాకులతో చాతిపై బాదుకుంటూ రక్తం చిందిస్తూ మహ్మద్ ప్రవక్త మను మడు ఇమాం హుసేన్ వీర మరణాన్ని స్మరిస్త్తూ మాతం ప్రదర్శన నిర్వహించినట్లు సంఘం పట్టణ అధ్యక్షుడు సయ్యద్ రజాక్ హుసేన్. తెలిపారు. ఈ ప్రదర్శనలో ప్రధాన కార్యదర్శి కల్బె హుస్సేన్, లాయక్ అలి,మహెది హుస్సేన్, అన్వర్ అలి ఆలిజాన్, రషీద్, తఖీ హుస్సేన్, సజ్జా ద్ అస్గార్ , సయ్యద్ అద్నాన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News