Wednesday, January 22, 2025

బూత్‌లలో బిఎల్‌ఒలను నియమించుకోవాలి

- Advertisement -
- Advertisement -

నల్గొండ:జిల్లాలోని అన్ని పోలింగ్ బూత్ లలో బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలని జిల్లా ఎ న్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వి విధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఓటర్ నమోదు అధికారు లు,ఎన్నికల విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈనెల 21వ తేదీన డ్రాఫ్ట్ ఎలక్ట్రోరల్ రోల్ను విడుదల చేస్తామన్నారు.

ప్రకటించిన ఎలక్ట్రోరల్ రోల్‌లో అభ్యంతరాలు లేదా మార్పులు ఉన్నట్లయితే ఈ నెల 21వ తే దీ నుండి సెప్టెంబర్ 19వ తేదీ వరకు పూర్తి చేస్తామన్నారు. పోలింగ్ కేంద్రాలలో ఆగస్ట్ 26,27 సెప్టెంబర్ 2,3 తేదీ లలో స్పెషల్ క్యా ంపైన్ నిర్వహిస్తామని,ఆయా తేదీలలో బిఎల్ ఓ లు పోలింగ్ బూత్ లలో ఉంటారని,,ఓటర్ జాబితా లో నమోదు కాని అర్హులైన ఓటర్లను నమోదు చేయాలని, స్పెషల్ క్యాంపైన్ గురించి విస్తృత ప్ర చారం గావించాలని తెలిపారు.బూత్ లెవెల్ ఏజెంట్ లు కూడా పా ల్గొనాలని ఆయన కోరారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆ యా కేంద్రాలలో బిఎల్వో లకు సహకరించాలని కోరారు.

తుది ఎలక్ట్రోరల్ రోల్ ను అక్టోబర్ 4వ తేదీన విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. జిల్లాలో మొత్తము ఆరు నియోజకవర్గాలు ఉండగా, 1747 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఇవి గాక నియోజకవర్గం ఇన్చార్జి అధికారులు 21 పోలింగ్ కేంద్రాలను కొత్తవి ప్రతిపాదించారు. పోలింగ్ కేంద్రాలను ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల లో ఉండే విధంగా చూ డాలన్నారు. అవి అందుబాటులో లేనప్పుడు మాత్రమే ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలన్నారు. మునుగోడు, మిర్యాలగూడ నియోజకవర్గాలలో పోలింగ్ కేంద్రాలు ఎక్కువగా మార్చినట్లు తన దృష్టికి వచ్చినందున మరొకసారి పో లింగ్ కేంద్రాలను ఎందుకు మార్చారు. అందుకు గల కారణాలను తనకు తెలియజేయాలన్నారు.

పోలింగ్ కేంద్రాలు పార్టీ కార్యాలయాలకు 200 మీటర్ల దూరంలో ఉండాలన్నారు. ఏ మతానికి సం బంధించిన ప్రార్థన స్థలంలో ఉండకూడదు అన్నారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్లు, హాస్పిటల్ ల పరిధిలో ఏర్పాటు చేయకూడదు అ న్నారు. అదేవిధంగా సాధారణ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు, మాజీ శాసనసభ్యుల నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉండకూడదని ప లు సూచనలు చేశారు. నియోజకవర్గ కేంద్రాల వారిగా ఈవీఎంల పంపిణీ కేంద్రాలను చదివి వినిపించగా వివిధ పార్టీల ప్రతినిధులు, అధికారులు ఆమోదయోగ్యమే అని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు హేమంత్ కేశవ్ పాటిల్,జె.శ్రీనివాస్ లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు బక్క పిచ్చయ్య (బిఆర్‌ఎస్), పోతేపాక లింగస్వామి (బిజెపి), గుమ్మల మోహన్ రెడ్డి (కాంగ్రెస్) నర్సిరెడ్డి (సిపిఐఎం), వంటేపాక యాదగిరి (బీఎస్పీ), బి. మల్లికార్జున్ (టిడిపి), షేక్ మోయిన్ (ఎఐఎంఐఎం), కుతుబుద్దిన్ (ఎఎపి), రవి, చెన్నయ్య, రాములు, తదితరులు పాల్గొన్నారు.అనంతరం జిల్లా కలెక్టరేట్ లో ఇవిఎం గోదాం ను, సీసీ కెమెరా నిఘా, పోలీస్ బందబస్తు ఏర్పాట్లను రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో కలిసి పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News