Friday, December 20, 2024

బిఎల్‌ఓలకు ప్రత్యేక తర్ఫీదు అందించాలి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : జిల్లాలో బి.ఎల్.ఓలు ఎన్నికల నియమ నిబంధనలపై పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎన్నిల విధి విధానాల పై జిల్లా స్థాయి మాస్టర్స్ ట్రైనర్స్‌తో నియోజకవర్గ స్థాయి మాస్టర్స్ ట్రైనర్స్‌లకు ఒక రోజు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల్లో అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ జాబితా తయారీలో బి.ఎల్.ఓ ల పాత్ర కీలకమైందని అన్నారు.

జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో ఉన్న 1168 మంది బిఎల్‌ఓ లకు ఈ నెల 19 నుండి 25 వరకు ఓటర్ జాబితా తయారి, మార్పులు, చేర్పులు అలాగే మరణించిన వారు, వలస వెళ్లిన వారి ఓట్లను పరిశీలించి తుది సమాచారం అందించుటలో కీలక పాత్ర పో షించే విధంగా శిక్షణా తరగతులు చేపట్టాలని సూచించారు. ఆయా నియోజకవర్గ ంలో ఎన్నికల సందర్భంగా చేపట్టే కార్యక్రమాల్లో వి విధ పార్టీల ప్రతినిధులకు సమాచారం అందించాలని సూచించారు. 80 సంవత్సరాలు దాటిన ఓటర్ యొక్క వివరాలను తప్పక సేకరించాలని ఆదేశించారు.

ఫోటో ఎలక్ట్రోల్ వచ్చిన తరువాత ఎలాంటి పొరపాటు జగకుండా ఎన్నిక ప్రక్రియ సక్రమంగా నిర్వహించడం జరుగుతుందని, ఎలక్ట్రోల్ సక్రమంగా నిర్వహించడం వలన గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఓటు శాతం ఎక్కువగా పెరిగిందనిన తెలిపారు. ఈ శిక్షణ ద్వారా ప్రతి నియోజకవర్గంలో గల మండాల వారీగా బి.ఎల్.ఓ లకు ప్రత్యేక తర్పీదు అందించాలని మాస్టర్స్ ట్రైనర్స్‌లను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా స్థాయి మాస్టర్స్ ట్రైనర్స్ సాయి గౌడ్, అమిన్ సింగ్, ఎన్నికల సిబ్బంది, ఏ.ఎల్.ఎం.టి లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News