Saturday, December 21, 2024

మర్మాంగాల్లోకి గాలి కొట్టాడు…

- Advertisement -
- Advertisement -

అమరావతి: బాలుడి పట్టుకొని మలవిసర్జన ద్వారంలో గాలి కొట్టడంతో చిన్నారి అస్వస్థతకు గురైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అనికేపల్లి గ్రామంలో కొందరు విద్యార్థులు వాలీబాల్ ఆడుతున్నారు. వాలీబాల్ లో గాలి తగ్గడంతో ఓ బాలుడు(12) అది తీసుకొని గాలి పంపు షాప్‌కు వద్దకు వెళ్లాడు. గాలి పంపు నిర్వహకుడు తొలికొండ రాజు బాలుడిని పట్టుకోగానే మిగితా బాలుర్లు పరుగులు తీశారు. బాలుడి మలద్వారంలో గాలి కొట్టగా కడుపు ఉబ్బింది. ఇంట్లో అమ్మనాన్నలకు చెబితే తిడుతారని నొప్పితోనే నిద్రకు ఉపక్రమించాడు. నొప్పి ఎక్కువ కావడంతో అతడిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉందని, మర్మాంగాలు, పొట్ట భాగం వాచిందని వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News