Friday, November 22, 2024

ఊడిన చక్రాలు

- Advertisement -
- Advertisement -

రన్నింగ్‌లోనే ఊడిపోయి పడ్డ బస్సు టైర్లు
ఎల్కతుర్తి వద్ద ఆర్‌టిసి అద్దెబస్సుకు ప్రమాదం
ఓవర్ లోడ్ కారణం కాదు

విచారణకు సజ్జనార్ ఆదేశం

మన తెలంగాణ/హన్మకొండ ప్రతినిధి/ కరీంనగర్: కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ డిపోకు చెందిన పల్లె వెలుగు అద్దె బస్సు ఆదివారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైంది. హుజూరాబాద్‌హన్మకొం డ రూట్‌లో వెళ్తున్న ఈ బస్సు ఎల్కతుర్తి సమీపంలోకి రాగానే వెనుక ఎడమ వైపు ఉన్న రెండు టైర్లు ఒక్కసారిగా ఊడిపోయాయి, పక్కనే ఉన్న పొలాల్లో పడ్డా యి. ఈ సంఘటనలో బస్సు స్వల్పంగా దెబ్బతింది. ప్రమాద సమయంలో బస్సు లో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డైవర్ రాజు అప్రమత్తమై బస్సును చాకచక్యంగా నిలిపివేయడంతో ఎవరికీ హాని జరుగలేదు.

ప్రమాద సమయంలో బస్సులో 80మంది ప్రయాణికులు ఉన్నారని, ఓవర్ లోడ్ వల్లే బస్సు చక్రాలు ఊడిపోయాయని ప్రచారం జరిగింది.కాగా, పల్లె వెలు గు అద్దె బస్సు ప్రమాద ఘటనపై ఆర్‌టిసి ఎండి సజ్జన్నార్ విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాలతో సమగ్ర నివేదికను అందజేయాలని అధికారులను ఆదేశించారు. హుజురాబాద్ డిపోకు చెందిన అద్దె పల్లె వెలుగు బస్సు ఓవర్ లోడింగ్ వల్లే ప్రమాదానికి గురైనట్లు వస్తున్న వార్తలు పూర్తి అవాస్తవమని ఆయన అన్నారు. ప్రమాద సమయంలో బస్సు 40 కిలోమీటర్ల వేగంతో వెళ్తోందని, అప్పుడు బస్సులో42 మంది ప్రయాణికులు ఉ న్నారన్నారు.

ప్రమాదం జరగగానే బస్సులోని వారందర్నీ సురక్షితంగా మరొక బస్సులో అధికారులు పంపించారని తెలిపారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. ప్రమాద సమయంలో 80 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఎండి సజ్జన్నార్ తెలిపారు. ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని ఆయన తెలిపా రు. అద్దె బస్సుల నిర్వహణలో వాటి యజమానులు అప్రమత్తంగా ఉండాలని,తరచూ తనిఖీలు చేస్తూ ఎప్పుడూ ఫిట్‌గా ఉంచుకోవాలన్నారు.

Bus tyre

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News