- Advertisement -
న్యూయార్క్: మైక్రోసాఫ్ట్ విండోస్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రపచవ్యాప్తంగా పలువురు యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిస్తోంది. పిసి స్క్రీన్లపై క్రౌడ్ స్ట్రైక్ ఎర్రర్ కనిపించిన వెంటనే సిస్టమ్ షట్ డౌన్ కావడంతో పాటు రీస్టార్ట్ అవుతోంది. భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ, బ్యాంకులు, ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులకు తదితర సేవలకు అంతరాయం ఏర్పడినట్టు సమాచారం.
- Advertisement -