Saturday, December 21, 2024

వేలానికి ట్విట్టర్ బర్డ్..

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : ట్విట్టర్ ప్రతీకాత్మక నియో బ్లూబర్డ్, విలువైన ఫర్నిచర్, వాడిన కిచెన్ మిక్సర్‌లను ఎలన్ మస్క్ వేలానికి పెడుతున్నారు. ఇప్పటికే ఈ బ్లూబర్డ్‌కు 35000 డాలర్ల ఆరంభ ఆఫర్ దక్కింది. నష్టాలు, చెల్లించాల్సిన వడ్డీల దశలో ఈ వేలం నిర్ణయం తీసుకున్నట్లు మస్క్ ప్రకటించారు. ఇటీవల ఆయన శాన్‌ఫ్రాన్సికోలోని కంపెనీ ప్రధాన కార్యాయలయానికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించారు. కంపెనీ మునిగిపోవల్సిందేనా? చక్కదిద్దాలని ఆదేశించారు.

ఈ క్రమంలో ట్విట్టర్‌కు చెందిన విలువైన సంకేతాత్మకం అయిన వస్తువులకు వేలం పాట గడువు వచ్చే బుధవారంతో ముగుస్తుంది. కంపెనీ ఉద్యోగులను భారీ సంఖ్యలో తీసేశారు. అద్దెలు, కాంట్రాక్టు బరువు బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంది. బ్లూబర్డ్ ఇతర వస్తువులు, కిచెన్ పరికరాలను విక్రయించేందుకు సిద్ధం అయ్యారు. కిచెన్‌లోని డిహైడ్రేటర్, ఫ్రయర్, రకరకాల మిషన్లు వేలానికి పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News