Tuesday, December 24, 2024

ఎఫ్‌బి, ఇన్‌స్టాల ఖాతాదారులకు బ్లూటిక్ ఆఫర్?

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: మస్క్ ట్విట్టర్ బాటను మెటా అనుసరిస్తోంది. ట్విట్టర్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లకు ఇప్పటికే బ్లూటిక్ సేవలను అందిస్తోంది. తరహాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాదారులకు బ్లూటిక్ ప్రవేశపెట్టనుందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ మేరకు మెటా పేజీలో కొన్ని స్క్రీన్‌షాట్లు సోషల్‌మీడియాలో దర్శనమిచ్చాయి. బ్లూటిక్ పొందిన ఫేస్‌బుక్ ఖాతాదారులకు అదేవిధంగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాదారులకు కూడా సదుపాయాలు మెటా కల్పించనుందని సమాచారం.

ఎఫ్‌బి పేజీలోని సమాచారం ఆధారంగామెటా చేసినవారికి మాత్రమే బ్లూటిక్ ప్రొఫైల్ అందిస్తారని సమాచారం. ఫారంను పూరించిన తర్వాత క్రియేటర్లు, పబ్లిక్ ఫిగర్లు, సెలబ్రిటీలు లేదా గ్లోబల్ బ్రాండ్‌లకు వెరిఫికేషన్ బ్యాడ్జ్ ఇవ్వనున్నారు. కాగా పెయిడ్ వెరిఫికేషన్ బ్యాడ్జ్ ఈ నెల ఆరంభంలోనూ ఎఫ్‌బి, ఇన్‌స్టాలో సూచించిన స్క్రీన్‌షాట్లు దర్శనమిచ్చాయి. అయితే మెటా ఇంకా అధికారికంగా బ్యాడ్జ్‌లు అందజేయనున్నట్లు ప్రకటించలేదు. బ్లూటిక్ సబ్‌స్రిప్షన్‌కు ఎంత వసూలు చేయననేది కూడా ప్రకటించాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News