Wednesday, January 22, 2025

సచివాలయం వద్ద కాలి బూడిదైన బిఎండబ్ల్యు కారు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మన తెలంగాణ/ నాంపల్లి : రాష్ట్ర సచివాలయం వద్ద మింట్ కంపౌండ్ రోడ్డులో ఓ కారు వెళుతుండగా అందుంలోంచి హఠాత్తుగా నల్లటి పొగలు, మంటలు చెలరేగి పూర్తిగా వాహనం దగ్ధమైంది. ఉన్నట్టుండి కారులోంచి ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిన అగ్నికీలలు, నల్లటి పొగలు చుట్టుముట్టడంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికుల కథనం ప్రకారం.. టిఎస్ 09ఎఫ్‌ఎం0096 నెంబర్ ఆధునాతన కారు రోడ్డుమీద వెళుతుండగా.. అందులో హఠాత్తుగా మంటలు, పొగలు వ్యాపించాయి. అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులు కారు అపి ప్రాణం భయంతో కిందికి దిగారు. వెంటనే కారు ముందు, వెనక భాగాలు, లోపల సీట్లు, స్టీరింగ్ తదితర చోట్లకు మంటలు శరవేగంగా అంటుకున్నాయి.

అక్కడే ఉన్న కొందరు దైర్యం చేసి మంటలు చెలరేగుతున్న కారుపైకి వాటర్ బాటిళ్లలో నీళ్లు చల్లారు. కానీ మంటల తగ్గుముఖం పట్టగా.. మరింత పెద్దగా వ్యాపించాయి. దీంతో స్థానికులు కేకలు, ఆరుపులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. మంటల ధాటికి లోపల సీట్లు, ఇతర భాగాలు ఆహుతయ్యాయి. సమాచారం అందగానే పోలీసులు, ఫైరింజిన్ సిబ్బంది హుటాహుటిన విచ్చేసి మంటల్లో కాలిపోతున్న కారుపై నాలుగు వైపులా నీళ్లు చల్లి మంటలను అదుపుచేశారు. అగ్నికి కారు దగ్ధమైంది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్ఠం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News