Sunday, January 19, 2025

హెలికాప్టర్‌లో టెన్త్ ప్రశ్నాపత్రాలు

- Advertisement -
- Advertisement -

సుక్మా : చత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ ప్రాబల్యపు సుక్మా జిల్లాకు బోర్డు పరీక్ష ప్రశ్నాపత్రాలను హెలికాప్టరులో పంపించారు. ఈ ప్రాంతంలోని మారుమూల జగర్‌గుండాలో ఓ పరీక్షా కేంద్రం ఉంది. ఇక్కడ నక్సల్స్ దళాల సంచారం ఎక్కువగా ఉండటంతో అధికారులు ఎక్కువగా ఇక్కడికి వాహనాలలో రావడానికి సాహసించరు. అయితే శుక్రవారం నుంచి చత్తీస్‌గఢ్‌లో 12వ తరగతి పరీక్షలు ఆరంభం అయ్యాయి. కాగా శనివారం నుంచి పదవ తరగతి పరీక్షలు మొదలు కానున్నాయి. ఇక్కడి పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను ఇప్పుడు హెలికాప్టర్లలో తీసుకురావల్సి వచ్చిందని స్థానిక అధికారులు శుక్రవారం తెలిపారు. అయితే హెలికాప్టరు ద్వారా ఇక్కడికి పరీక్షా పత్రాలు పంపించడం ఇదే తొలిసారి కాదు.

గత ఏడాది కూడా ఈ విధంగా బట్వాడా జరిగింది. రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తు తమకు ప్రాధాన్యం అని , అందుకే హెలికాప్టరును వాడుకున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. సుక్మాకు హెలికాప్టర్‌లో ప్రశ్నాపత్రాలను పంపిస్తున్న ఫోటోలను సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పొందుపర్చారు. తగు విధమైన ఏర్పాట్లకు దిగిన జిల్లా అధికార యంత్రాంగాన్ని సిఎం ప్రశంసించారు.రాష్ట్రంలో విద్యార్థులందరికి సరైన విద్య అందాలనేదే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన అని, ప్రత్యేకించి పరీక్షల సమయంలో రాజీ లేకుండా వ్యవహరించడం జరుగుతుందని వివరించారు. సుక్మా జిల్లాలో మొత్తం 16 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. కాగా పూర్తిగా సమస్మాత్మకంగా ఉన్న జగర్‌గుండాకు పత్రాలను ఫిబ్రవరి 27న హెలికాప్టరులో భద్రంగా తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News