Thursday, January 23, 2025

ఏడాదిలో రెండు సార్లు బోర్డు పరీక్షలు..

- Advertisement -
- Advertisement -

ఏడాదిలో రెండు సార్లు బోర్డు పరీక్షలు
బట్టీ చదువులకు స్వస్తి చెప్పే విధంగా పరీక్షా విధానం
కొత్త కరికులమ్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించిన కేంద్ర విద్యాశాఖ
న్యూఢిల్లీ: నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా కేంద్రం విద్యావ్యవస్థలో పలు కీలక మార్పులకు సిద్ధమైంది. బోర్డు పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహించేలా కొత్త కరికులమ్ ఫ్రేమ్‌వర్క్‌ను కేంద్ర విద్యాశాఖ రూపొందించింది. దీని ప్రకారం విద్యార్థులు ఇకపై ఏడాదిలో రెండు సార్లు బోర్డు పరీక్షలు రాయడంతో పాటుగా ఆయా సబ్జెక్ట్‌లలో సాధించిన ఉత్తమ స్కోరును ఎంచుకునే అవకాశం కలుగుతుంది.

ఇలా ఏడాదికి రెండు సార్లు పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థులపై ఒత్తిడి తగ్గడంతో పాటుగా వారు మెరుగైన స్కోరు సాధించడానికి అవకాశం లభిస్తుందని విద్యాశాఖ తెలిపింది. అలాగే 11, 12 తరగతుల విద్యార్థులు రెండు లాంగ్వేజిలను కచ్చితంగా అభ్యసించాలని, వాటిలో ఒకటి భారతీయ భాష అయి ఉండాలని కూడా విద్యాశాఖ స్పష్టం చేసింది. నూతన జాతీయ విద్యావిధానానికి( ఎన్‌ఇపి)అనుగుణంగానే 2024 విద్యాసంవత్సరానికి పాఠ్య పుస్తకాలను రూపొందిస్తామని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది.

బట్టీ చదువులకు స్వస్తిచెప్పే విధంగా కొత్త పరీక్షా విధానం ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే నేషనల్ కరికులమ్ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం 11, 12తరగతులలో సబ్జెక్ట్‌ల ఎంపిక కేవలం ఆర్ట్, సైన్స్, కామర్స్ గ్రూపులకు మాత్రమే పరిమితమై ఉండదని తెలిపింది. ఏడాదికి రెండు సార్లు పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు తగినంత సమయం దొరకడంతో పాటుగా మంచి పనితీరును కనబరిచేందుకు వీలుగా కొత్త పాఠ్య ప్రణాళికను రూపొందించారు. అంతేకాకుండా సబ్జెక్ట్‌లపై పూర్తి అవగాహన,ప్రాక్టికల్ నైపుణ్యాలను విద్యార్థులకు అందించడమే లక్షంగా దృష్టిపెట్టనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News