Wednesday, January 22, 2025

 ఏడాదిలో రెండు సార్లు బోర్డు పరీక్షలు : కేంద్ర విద్యాశాఖ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఏటా రెండుసార్లు నిర్వహించ తలపెట్టిన పది, 12 వ తరగతి బోర్డు పరీక్షలకు రెండింటికీ హాజరు కావడం తప్పనిసరి కాదని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఇప్పటివరకు బోర్డు పరీక్షలకు ఒకే ఒక్కసారి హాజరయ్యే అవకాశం ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, దీన్ని తగ్గించేందుకే కొత్త విధానాన్ని తీసుకు వచ్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ప్రధాన్ మాట్లాడారు. డమ్మీ పాఠశాలలను విస్మరించలేమని, దీనిపై చర్చ జరగాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

“ పది, 12 వ తరగతి బోర్డు పరీక్షల్లో హాజరయ్యేందుకు విద్యార్థులకు ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ పరీక్ష జేఈఈ మాదిరిగా రెండుసార్లు అవకాశం ఉంటుంది. అందులో ఉత్తమ స్కోర్‌ను వాళ్లు ఎంచుకోవచ్చు. అయితే ఇదంతా ఐచ్ఛికమే . తప్పనిసరి లేదు. ఆశించిన స్థాయిలో రాయలేదనే భయం , అవకాశం కోల్పోయామనే ఆందోళన , ఇంకా ఉత్తమంగా రాయెచ్చనే విషయాలను ఆలోచిస్తూ విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. అందుకే కొత్తగా ఈ ఐచ్ఛిక విధానాన్ని ప్రారంభిస్తున్నాం. ఒక వేళ తొలిదఫా పరీక్షల్లో మంచి స్కోరు వచ్చిందని భావిస్తే తదుపరి పరీక్షకు హాజరుకానవసరం లేదు” అని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News