Sunday, December 22, 2024

హర్ని సరస్సులో పడవ ప్రమాదం: 16 మంది మృతి

- Advertisement -
- Advertisement -

గాంధీ నగర్: గుజరాత్ రాష్ట్రం వడోదరలో విహారయాత్రలో శుక్రవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. హర్ని సరస్సులో బోటు తిరగబడి 16 మంది మృతి చెందారు. మృతులలో 14 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. గాయపడిన 10 మందిని ఆస్పత్రికి తరలించారు. న్యూ సన్ రైజ్ స్కూల్ చెందిన 24 మంది విద్యార్థులుతో నలుగురు ఉపాధ్యాయులు విహార యాత్రకు వెళ్లారు. 14 సీట్లు ఉన్న పడవలో పరిమితికి మించి 28 మంది ఎక్కడంతో పడవ తిరగబడింది. 10 మంది మాత్రమే లైఫ్ జాకెట్లు ధరించారు. ఈ ఘటన ప్రధాన మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇస్తామని కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. గాయపడిన వారికి రూ.50 వేలు ఇస్తామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News