Friday, April 18, 2025

అవుకు రిజర్వాయర్‌లో పడవ బోల్తా… కానిస్టేబుల్ కూతురు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాలలో విహారయాత్రలో విషాదం నెలకొంది. అవుకు రిజర్వాయర్‌లో 12 మందితో వెళ్తున్న పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ రసూల్ కుమార్తె దుర్మరణం చెందింది.  మర బోట్ల సహాయంతో పది మందిని కాపాడారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఆదివారం సెలవు ఉండడంతో కానిస్టేబుల్ రసూల్ తన కుటుంబంతో కలిసి అవుకు రిజర్వాయర్‌ వెళ్లాడు. ఇంతలోనే ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News