Sunday, December 22, 2024

బిహార్ లో పడవ ప్రమాదం: పది మంది విద్యార్థులు గల్లంతు

- Advertisement -
- Advertisement -

పాట్నా: బిహార్ రాష్ట్రం ముజఫర్‌పూర్‌లో గురువారం ఉదయం పడవ ప్రమాదం చోటుచేసుకుంది. బినిబాడ్ ప్రాంతంలో మాధాపూర్ పట్టి ఘాట్‌లోని బాగమతి నదిలో పడవ మునిగిపోవడంతో పది మంది విద్యార్థులు గల్లంతయ్యారు. 20 మంది విద్యార్థులను స్థానికులు కాపాడారు. పడవలో 30 మంది విద్యార్థులు ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం గజఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై సిఎం నితీశ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు సిఎం ఆదేశించారు.

Also Read:  చంద్రబాబు అరెస్టుపై మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News