Saturday, December 21, 2024

పడవ బోల్తా..8 మంది మృతి

- Advertisement -
- Advertisement -

గ్రీకులోని రోడ్స్ ద్వీపం సమీపంలో శుక్రవారం ఉదయం వలసదారులతో వెళ్తున్న స్పీడ్ బోట్ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారని, 18 మందిని కాపాడామని గ్రీకు అధికారులు తెలిపారు. గస్తీ నౌకను తప్పించుకోడానికి ఆ స్పీడ్ బోట్‌ను ప్రమాదకరంగా నడిపారని, దాంతో వలసదారులు సముద్రంలో పడిపోయారని, వారిలో పద్దెనిమిది మందిని రక్షించినట్లు కోస్ట్‌గార్డ్ తెలిపాడు. ద్వీపం ఈశాన్యంలోని అఫాంటౌ బీచ్ ప్రాంతంలో మూడు తీరప్రాంత గస్తీ నౌకలు,హెలికాప్టర్‌లకు చెందిన రెస్కూ వర్కర్లు పనిచేస్తున్నారు. ప్రయాణికులు ఎవరైనా గల్లంతయ్యారా అన్నది తెలియడం లేదని అధికారులు తెలిపారు. మునిగిపోక బయటపడిన ఎనిమిది మందిని హాస్పిటల్‌లో చేర్చినట్లు స్థానిక అధికారులు ప్రభుత్వ టెలివిజన్‌లో తెలిపారు.

వారి పరిస్థితి క్లిష్టంగా ఉందని కూడా వారు పేర్కొన్నారు. రోడ్స్ ద్వీపం గ్రీకులోని ఓ పెద్ద ద్వీపం. ఇది టర్కీ తీరం దగ్గర ఉంది. తూర్పు మెడిటేరియన్ రూట్‌లో ఇక్కడ స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుంటుంది. వలసదారులు పెద్ద ఎత్తున ఇలా మరణించడం వారంలో ఇది రెండోసారి.మధ్యప్రాచ్యంలో యుద్ధాల ఫలితంగా ఏథెన్స్ అధికారులు రాకపోకలు పెరగడంపై కట్టడి పెట్టారు. ప్రతి ఏటా గ్రీకు దేశానికి 60వేల మంది అక్రమంగా వలస వస్తున్నారు. వారిలో సిరియన్లు ఎక్కువగా ఉంటున్నారు. ఆ తర్వాత అఫ్ఘాన్, ఈజిప్ట్, ఎరిథ్రియా, పాలస్తీనా దేశస్థులు ఉంటున్నారని ప్రభుత్వ డేటా ప్రకారం తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News