Wednesday, January 22, 2025

జీలం నదిలో మునిగిన పడవ: నలుగురు జలసమాధి

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: కశ్మీర్‌లోని జీలం నదిలో మంగళవారం పడవ బోల్తాపడడంతో నలుగురు జలసమాదయ్యారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయడపడడంతో ఆస్పత్రికి తరలించారు. పడవ 11 మంది ప్రయాణికులతో గందర్ బాల్ నుంచి బట్వారాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గత రెండు రోజుల నుంచి జమ్ము కశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తుండడంతో జీలం నది పొంగ పొర్లుతోంది. పడవలో పాఠశాల విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. మృతులు షబీర్ అహ్మద్(26), గుల్జార్ అహ్మద్(41), మరో ఇద్దరు మహిళలను గుర్తించారు. ఈ ఘటనపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, పిడిపి చీఫ్ మొహబూబా ముఫ్లీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News