- Advertisement -
డాకర్: పశ్చిమాఫ్రికాలోని సెనెగల్ దేశంలోని తీర ప్రాంతంలో తీవ్ర విషాదం వెలుగులోకి వచ్చింది. డాకర్ తీరానికి 70 కిలో మీటర్ల దూరంలో పడవ సముద్రంలో కొట్టుకొని పోతుండగా నౌకదళం పట్టుకంది. పడవలో 30 మృతదేహాలు కనిపించాయని నౌకదళం తెలిపింది. మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయని, గుర్తించడం కష్టంగా ఉందన్నారు. పడవ ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసుకొని మృతుల వివరాలు వెల్లడిస్తామని సెనెగల్ మిలిటరీ ప్రతినిధి ఇబ్రహీమా సౌ వెల్లడించారు. గతంలో సెనెగల్ తీరంలో పడవ మునిగి 37 మంది జలసమాధైన విషయం తెలిసిందే. పశ్చిమ ఆఫ్రికా నుంచి వలసదారులు సెనెగల్ ద్వారా విదేశాలకు అక్రమంగా వలస వెళ్తుంటారు. స్పెయిన్ కు చెందిన కానరీ దీవులకు పయనమవుతారు. ఇప్పటివరకు దాదాపుగా 22300 మంది పైగా వలసదారులు కానరీ దీవుల్లో అడుగుపెట్టినట్టు సమాచారం.
- Advertisement -