Wednesday, January 22, 2025

పవన్ ‘హరిహర వీరమల్లు’లో బాలీవుడ్ హీరో (వీడియో)

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ చేరాడు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించి, ఆయన సెట్ కు వచ్చిన వీడియోను శనివారం విడుదల చేశారు. వీడియోలో, బాబీ డియోల్ కారు దిగి చిత్ర బృందంతో సంభాషించడాన్ని చూడోచ్చు. ఇప్పుడు ఈ వీడియోపై సినీ ప్రియులు పలు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా, మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ. దయాకర్ రావు నిర్మించారు. ఈ పీరియాడికల్ యాక్షన్ సినిమాలో పవన్ రెండు పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో థియేటర్స్ లోకి రానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News