Monday, December 23, 2024

బోధన్‌లో బాలికపై బిఆర్‌ఎస్ కార్యకర్త అత్యాచారం..

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: బిఆర్‌ఎస్ కార్యకర్త బాలికపై అత్యాచారం చేసిన సంఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కొత్తపల్లి రవీందర్ అనే బిఆర్‌ఎస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా పని చేస్తున్నాడు. శంకర్ నగర్ కాలనీలో ఓ బాలిక తన తండ్రి చనిపోవడంతో తల్లితో ఉంటుంది. తల్లి కూడా అనారోగ్యంతో గత కొన్ని రోజుల నుంచి బాధపడుతోంది. అదే కాలనీలో రవీందర్ అనే వ్యక్తి బాలికను రేకుల షెడ్‌లోకి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేసి ఈ విషయం ఎవరికి చెప్పవద్దని బెదిరించాడు.

Also Read: కూలిన ఫ్లై ఓవర్

బాలిక తన తల్లితో పాటు బంధువులకు తెలియజేయడంతో రవీందర్ సోదరుడు బిఆర్‌ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాధాకృష్ణ ఇంటికి వెళ్లి ప్రశ్నించడంతో వారిని బెదరించి పంపించాడు. వెంటనే బాలిక తన తల్లి, బంధువులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోక్సో చట్టం కింద నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. స్థానిక బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ షకీల్ బాలిక ఇంటికి వెళ్లి పరామర్శించారు. బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిందితుడు రవీందర్, సోదరుడు రాధాకృష్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News