- Advertisement -
బోధన్: తెలంగాణ ఐటి,మున్సిపల్ శాఖమంత్రి కెటిఆర్ ను గురువారం హైదారాబాద్ లోని నివాసంలో బోధన్ ఎంఎల్ఎ మహ్మద్ షకీల్ ఆమేర్ కలిశారు. బోధన్ నియోజకవర్గంలోని ప్రస్తుతం ఉన్న కొన్ని మండలాలను విభజన చేయాలని బోధన్ మున్సిపాలిటీ ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించి మండలాల విభజనకు, ప్రత్యేక నిధులు మంజూరుకు కృషి చేస్తానని కెటిఆర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి షకీల్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -