నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ దాష్ట్టీకం
మన తెలంగాణ/బోధన్: నిజామాబాద్ జిల్లా, బోధన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం అమానవీయమైన ఘటన చోటు చేసుకుంది. ఓ కేసులో పోలీ స్ స్టేషన్‌కు వచ్చిన వ్యక్తి కాళ్లకు సంకెళ్లు వేసి వెట్టిచాకిరీ చేయించడం వివాదాస్పదంగా మారిం ది. ఈ ఘటనకు బాధ్యుడైన హెడ్ కానిస్టేబుల్ వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నా యి. వివరాల్లోకి వెళ్తే..బోధన్ పట్టణ శివారులోని బిలాలకు చెందిన యువకుడిని దొంగతనం కేసు లో పోలీస్ స్టేషన్‌కు తెచ్చారు. యువకుడు పారిపోకుండా ఉండేందుకు పోలీసులు అతని కాళ్లకు సంకెళ్లు వేశారు. అతనితోనే స్టేషన్ ఆవరణలో వెట్టి చాకిరీ పనులను చేయించారు.
విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ సదరు వ్యక్తితో పోలీస్ స్టేషన్లో శుభ్రం చేయించే పనులను చేపట్టడంతో ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బహిర్గతమయ్యాయి. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా పోలీస్ శాఖలో కలవరం మొదలైంది. ఈ వ్యవహారం మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈఘటనపై లోతైన విచారణ జరిపి పోలీస్ స్టేషన్లో సంకెళ్లు వేయడం, వెట్టి చాకిరీ చేయించడంపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు సంఘాలు, రాజకీయ నేతల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది.