అంకారా: గ్రీకు సరిహద్దులో చలికి మృతి చెందిన 12 మంది వలసదారుల మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారని టర్కీ అంతరంగిక మంత్రి సులేమాన్ సోయ్‌లూ బుధవారం తెలిపారు. వారిని టర్కీ సరిహద్దులో వెనక్కి గెంటేయడంతో చలికి చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. గ్రీకు సరిహద్దు రక్షకులు 22 మంది వలసదారులను టర్కీలోకి నెట్టేయడంతో వారిలో 12 మంది చలికి చనిపోయారని గ్రీకు అంతరంగిక మంత్రి తెలిపారు. గ్రీకు, టర్కీ సరిహద్దులో ఇప్సాలా వద్ద వారు బూట్లు లేకుండా, గుడ్డలు కూడా లేకుండా లభించారని ఆయన తెలిపారు. ఆయన వివరాలు తెలుపనప్పటికీ, గ్రీకు సరిహద్దు యూనిట్ల క్రూరత్వాన్ని నిందించారు.
గ్రీకు సరిహద్దు యూనిట్ల విషయంలో యూరొపియన్ యూనియన్ మెతకవైఖరిని అనుసరిస్తున్నట్లు కూడా ఆయన ఆరోపించారు. గ్రీకు దేశం తరచూ వలసదారులను అక్రమంగా గెంటేస్తూ వారు యూరొప్‌లోకి వెళ్లేలా చేస్తోందని టర్కీ ఆరోపిస్తున్నది. కాగా టర్కీ ఆరోపణలను గ్రీకు ఖండిస్తోంది. మధ్య ప్రాచ్యం నుంచి ఆసియా, ఆఫ్రికా, యూరిప్ దేశాలలో మరింత మెరుగైన జీవనం ఆశిస్తున్న వారికి టర్కీ ప్రధాన సరిహద్దు దాటే ప్రదేశంగా(క్రాసింగ్ పాయింట్‌గా) ఉంది. చాలా మంది స్మగ్లింగ్ పడవల ద్వారా ఈశాన్య సరిహద్దు గుండా గ్రీకును దాటుతుంటారు.