Sunday, December 22, 2024

జమ్మూలో సొరంగం శిథిలాలలో మరో 3 మృతదేహాలు లభ్యం

- Advertisement -
- Advertisement -

Bodies of 3 labourers found in Ramban tunnel

బనిహాల్(జమ్మూ): జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఇటీవల కూలిపోయిన నిర్మాణంలో ఉన్న సొరంగం శిథిలాల నుంచి మరో మూడు మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు శనివారం తెలిపారు. దీంతో ఈ దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య నాలుగుకు పెరిగింది. శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్న తొమ్మిదిమంది కార్మికులను వెలికితీసే ప్రయత్నాలు శనివారం ఉదయం మళ్లీ ప్రారంభమయ్యాయి. శుక్రవారం సాయంత్రం ఆ ప్రాంతంలో మళ్లీ కొండ చరియలు విరిగిపడడంతో వెలికితీత ప్రక్రియను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. దాదాపు ఏడు గంటల పాటు అవిశ్రాంతంగా శిథిలాల తొలగింపు అనంతరం రెండు మృతదేహాలు లభించాయని, వీటిని గుర్తించేందుకు సమీపంలోని ఆసుపత్రికి తరలించామని అధికారులు చెప్పారు. మరో మృతదేహం శిథిలాల కింద కనిపించిందని, దాన్ని వెలికితీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News