Monday, January 20, 2025

సముద్రంలో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం

- Advertisement -
- Advertisement -

Bodies of missing students found in sea

సముద్రంలో ప్రమాదవశాత్తు కొట్టుకుపోయిన విద్యార్థులు
ఒకరు సేఫ్, ఆరుగురి మృతి

మనతెలంగాణ, హైదరాబాద్ : సముద్రంలో గల్లంతైన ఇంజనీరింగ్ విద్యార్థుల మృతదేహాల ఆచూకీ లభ్యమైంది. సముద్రంలో గల్లంతైన వారిలో శనివారం ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మొత్తం ఏడుగురు విద్యార్థులు సముద్రంలో గల్లంతుకాగా శుక్రవారం ఒక విద్యార్థి మృతదేహం లభ్యం అయింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం అనకాపల్లి ఎన్టీర్ ఆస్పత్రికి తరలించారు. అనకాపల్లిలోని దాడి ఇంజనీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న 15 మంది విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం కళాశాలలో పరీక్షలు ముగిసిన తర్వాత రాంబిల్లి మండలం సీతపాలెం సముద్రతీరానిక వెళ్లారు. ఇందులో విశాఖకు చెందిన కంపర జగదీష్, గుంటూరుకు చెందిన బయ్యపునేని సతీష్‌కుమార్, అనకాపల్లి జిల్లా రోలుగుంటకు చెందిన జశ్వంత్‌కుమార్, మునగపాకకు చెందిన సూరిశెట్టి తేజ, చూచుకొండకు చెందిన పెంటకోట గణేష్, ఎలమంచిలికి చెందిన పూడి రామచందు, నర్సిపట్నం మండలం పెద్దబొడ్డేపల్లికి చెందిన గుడివాడ పవన్ సూర్యకుమార్, మరో ఎనిమిది మంది స్నేహితులు తీరానికి వెళ్లారు. ఇందులో ఏడుగురు విద్యార్థులు సముద్రస్నానాలకు దిగారు.

ఈ సమయంలోనే రాకాసి అల రావడంతో ఏడుగురు విద్యార్థులు ఒక్కసారిగా సముద్రం లోపలికి వెళ్లారు. రక్షించాలని ఒడ్డున ఉన్న విద్యార్థులు కేకలు వేయడంతో స్థానిక మత్సకారులు సూరిశెట్టి తేజ అనే విద్యార్థిని కాపాడారు. విషయం తెలియడంతో నేవీ హెలికాప్టర్, నాలుగు బోట్లతో కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీనసులు, మత్సకారుల సహాయంతో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం రెండు హెలికాప్టర్లు తీరం వద్ద నలుగురు విద్యార్థుల మృతదేహాలను గుర్తించారు. నీటిపై తేలియాడుతున్న మృతదేహాలను హెలికాప్టర్ ద్వారా ఒడ్డుకు చేర్చారు. శనివారం మధ్యాహ్నం మరో విద్యార్థి జశ్వంత్ మృతదేహాన్ని తంతడి తీరంలో గుర్తించారు. దీంతో గల్లంతైన ఏడుగురు విద్యార్థుల్లో ఆరుగురి మృదేహాలు లభ్యమయ్యాయి. ఒకరు కొనప్రాణాలతో బయడపటి కెజిహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News