Monday, January 20, 2025

పంజుగుల గ్రామంలో బొడ్రాయి పండుగ వార్షిక ఉత్సవాలు

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి రూరల్: కల్వకుర్తి మండలంలోని పంజుగుల గ్రామంలో బొడ్రాయి పండుగ వార్షిక ఉత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. గ్రామంలోని ఈదమ్మ, కోట మైసమ్మ, బొడ్రాయి దేవతలను ప్రతిష్ఠంచి ఒక సంవత్సరం పూర్తైన సందర్భంగా గ్రామంలోని ఆడపడుచులు, మహిళలు పెద్ద ఎత్తున బొడ్రాయికి నీళ్లు పోసి, బోనాలతో ఊరేగింపుగా తరలివచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

బొడ్రాయి పండుగ నిర్వహించి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా గ్రామ దేవతలకు దూప దీప నైవేద్యాలు సమర్పించి జలాలతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పద్మ ఆంజనేయులు, ఎంపిపి సామ మనోహర చెన్నకేశవులు, గ్రామ వార్డు సభ్యులు, బిఆర్‌ఎస్ నాయకులు గణేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News