Sunday, January 19, 2025

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బొడ్రాయి పండగ

- Advertisement -
- Advertisement -
  • షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్

నందిగామ: తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక బొడ్రాయి పండగ అని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలం మొదళ్లగూడ గ్రామంలో పాలమూరు జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ నాగరకుంట నవీన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్మించిన పోచమ్మతల్లి, మైసమ్మతల్లి విగ్రహాల ఆవిష్కరణ, బొడ్రాయి ప్రతిష్ఠాపనలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బొడ్రాయి విగ్రహాలు మూల స్థంభాలుగా పిలుస్తారని, ప్రతి గ్రామంలో గ్రామ నడిబొడ్డున బొడ్రాయి ఉండి ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతుందన్నారు.

ప్రజలపై అమ్మవారి దీవెనలు ఎల్లప్పుడు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మాజీ జెడ్పీటీసీ శ్యాంసుందర్‌రెడ్డి, సర్పంచ్ ఉమా ప్రవీణ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ అశోక్, బీజేపీ సీనాయర్ నాయకులు శ్రీవర్ధన్‌రెడ్డి, అందె బాబయ్య, తుప్పుర రవి, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News