Thursday, January 23, 2025

ఘనంగా బొడ్రాయి తృతీయ వార్షికోత్సవం

- Advertisement -
- Advertisement -

మరిపెడ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం దంట్లకుంటతండా గ్రామ పంచాయితీ పరిధిలోని బొడ్రాయి ప్రతిష్టాపన తృతీయ వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గుగులోతు భరత్ కుమార్ ఆధ్వర్యంలో తండా గిరిజన ప్రజలంతా బోనాలతో బొడ్రాయి అమ్మవారి ప్రాంగణానికి తరలివచ్చి బోనాలు సమర్పించారు. వేదపండితులు రవిశాస్త్రీ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య నాభిశిల తృతీయ వార్షికోత్సవ పూజలు గ్రామస్తులు నిర్వహించారు. గ్రామ దేవత బొడ్రాయి వద్ద గ్రామంలోని గిరిజనులంతా భక్తిశ్రద్ధలతో పాల్గొని ప్రత్యేకంగా అభిషేకాలు, సామూహిక కుంకుమార్చన విశేష పూజలు వేద పండితులచే నిర్వహించారు.

గ్రామ దేవతను దర్శించుకున్న గిరిజన ప్రజలు పాడిపంటలు, గ్రామాన్ని చల్లగా చూడు తల్లి అని వేడుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ముందుగా వేద పండితులు బొడ్రాయి, కుంకుమార్చన విశిష్టతను వివరించారు. గ్రామంలోని మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా సర్పంచ్ గుగులోతు భరత్ కుమార్ మాట్లాడుతూ సకల దేవతల ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. గ్రామ దేవత ఆశీర్వాదంతో సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సంవృద్ధిగా పండి ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భూక్య వెంకన్న నాయక్, బానోతు పాండు నాయక్, మాజీ సర్పంచ్ గుగులోతు నర్సింహా, జెమిని వీరన్న, రామన్న, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News