- Advertisement -
మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ ఓ అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. నిందితుడిని విద్యుత్ ఏఈ ప్రసాద్ బాబుగా గుర్తించారు. చిన్నిచిన్న కాంట్రాక్ట్ పనులు చేసుకుంటున్న నవీన్ అనే కాంట్రాక్టర్ వద్ద ప్యానల్ బోర్డ్ కోసం ఏఈ ప్రసాద్ రావు పదివేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. లంచం తీసుకుంటుండగా ఎసిబి అదికారులు మంగళవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం విద్యుత్ సబ్ స్టేషన్ లోనూ అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
- Advertisement -