Wednesday, December 25, 2024

రోడ్డు ప్రమాదంలో ‘మిస్టర్ తెలంగాణ’ సోహైల్ మృతి

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట్:  ‘మిస్టర్ తెలంగాణ’ టైటిల్ విజేత, ప్రముఖ బాడీ బిల్డర్ మహ్మద్ సోహైల్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. బైక్ పై వేగంగా దూసుకెళుతూ అదుపుతప్పి ఆటోను ఢీ కొట్టాడు. దీంతో తీవ్రగాయాలపాలైన సోహైల్ ను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోహైల్ చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. బాడీ బిల్డర్ గా పలు ఛాంపియన్ షిప్ లు గెల్చుకున్న సోహైల్ వయసు కేవలం 23 ఏళ్లు మాత్రమే.

తన కెరీర్‌లో సిద్దిపేట్ జిల్లా, తెలంగాణ రాష్ట్ర, సౌతిండియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లను సొంతం చేసుకున్నాడు. చిన్న వయసులోనే సోహైల్ ‘మిస్టర్ తెలంగాణ’ టైటిల్ ను గెల్చుకున్నాడు. చిన్నవయసులోనే సోహైల్ చనిపోవడంపై సిద్దిపేట వాసులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News