Wednesday, January 22, 2025

మూసి నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః గుర్తుతెలియని వ్యక్తి మృతదేహకం మూసి నాలాలో కొట్టుకు వచ్చిన సంఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…ముసరాంబాగ్‌లోని మూసి నాలాలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకువచ్చింది.

ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. డిఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News