Sunday, December 22, 2024

కలకలం రేపుతున్న యువతి మృతదేహం

- Advertisement -
- Advertisement -

Body of young woman found in Sanathnagar

 

హైదరాబాద్ : సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లభించిన యువతి మృతదేహం కలకలం సృష్టిస్తోంది. యువతి మృతదేహం మూడు రోజుల క్రితం నిర్మాణంలో ఉన్న భవనం ఐదో అంతస్థులో కుళ్లిపోయిన స్థితిలో లభించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అప్పటి నుంచి యువతి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నించినా ఇప్పటి వరకు ఎలాంటి క్లూ లభించలేదు. దీంతో స్థానికంగా ఉన్న సిసిటివిలను పరిశీలించగా ఓ యువకుడు యువతిని నాలుగు రోజుల క్రితం యువతిని భవనంలోకి తీసుకుని వెళ్లినట్లు తెలిసింది, స్థానికులు కూడా ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు ఇద్దరు కలిసి వెళ్లినట్లు ఉన్న సిసిటివి ఫుటేజ్‌ను విడుదల చేశారు. వారికి ఆచూకీ తెలిసిన వారు వెంటనే సనత్‌నగర్ పోలీసులను మొబైల్ నంబర్ 9490617132లో సంప్రదించాలని కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News