Saturday, November 23, 2024

బోయింగ్ 737 విమాన వాణిజ్య సర్వీసులపై ఆంక్షల ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

Boeing 737 Max Aircraft Now Can Operate

న్యూఢిల్లీ : బోయింగ్ 737 మాక్స్ విమాన వాణిజ్య కార్యకలాపాలపై గత రెండున్నరేళ్లుగా ఉన్న ఆంక్షలను భారత విమానయాన నియంత్రణ సంస్థ డిజిసిఎ గురువారం ఎత్తివేసింది. అడిస్ అబాబా సమీపాన 2019మార్చి 10 న ఇథోపియన్ ఎయిర్ లైన్స్ 737 మ్యాక్స్ విమానానికి జరిగిన ప్రమాదంలో నలుగురు భారతీయులతో పాటు మొత్తం 157 మంది మరణించారు. ఈ ప్రమాదం తరువాత బోయింగ్ 737 విమానాలన్నిటినీ డిజిఎఎ నిషేధించింది. ఆ తరువాత బోయింగ్ తన విమానాల్లో ప్రయాణికులకు తగిన సౌకర్యాలను విస్తరింప చేయడంతో డిజిసిఎ ఆ విమాన సర్వీసులపై నిషేధం ఎత్తివేస్తున్నట్టు గురువారం ప్రకటించింది.

Boeing 737 Max Aircraft Now Can Operate

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News