Monday, December 23, 2024

చైనాలో 133 మందితో కుప్పకూలిన విమానం

- Advertisement -
- Advertisement -

China plane crash
బీజింగ్: 133 మంది ప్రయాణికులతో బయలుదేరిన చైనా ఈస్టర్న్ ప్యాసింజర్ జెట్‌ఎంయూ-5735 కొండల్లో కుప్పకూలింది. ఎంత మంది చనిపోయారన్నది ఇప్పటివరకు తెలియలేదని సోమవారం సిసిటివి పేర్కొంది. బోయింగ్737 విమానం గువాంగ్జి ప్రాంతంలోని ఊజూ నగరం దగ్గర గ్రామీణ ప్రాంతంలో కూలిపోయింది. ఘటనాస్థలికి రెస్కూ టీమ్‌ను వెంటనే పంపించారు. కున్‌మింగ్ నగరం నుంచి మధ్యాహ్నం 1.00 గంటలకు బయలుదేరిన ఆ విమానం గ్వాంగ్‌ఝూ గమ్యానికి చేరుకోనేలేదని స్థానిక మీడియా పేర్కొంది. ఈ దుర్ఘటనపై చైనా ఈస్టర్న్ సంస్థ నుంచి ఇంకా ఎటువంటి స్పందన వెలువడలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News