Thursday, January 23, 2025

తెలంగాణ మరో ఘనత

- Advertisement -
- Advertisement -

జిఎంఆర్ ఏరో టెక్నాలజీతో బోయింగ్ ఒప్పందం
ప్రయాణికుల విమానం సరకు రవాణాగా
మార్పు నేడు అధికారిక ప్రకటన
హైదరాబాద్: ప్రయాణికుల విమానాన్ని సరకు రవాణా (కార్గో) విమానంగా మార్పిడి చేసే టెక్నాలజీని భారత్‌కు తీసుకు రావడానికి ఒక ఒప్పందం కుదుర్చుకోబోతున్నట్లు ప్రముఖ విమాన తయారీ సంస్థ అయిన బోయింగ్ గురువారం ప్రకటించింది.737 బోయింగ్ విమానాన్ని సరకు రవాణా విమానం గా మార్చడాన్ని అమలు చేయడానికి బోయింగ్ హైదరాబాద్‌లో ని జిఎంఆర్ ఏరో టెక్నిక్స్‌తో భాగస్వామి కానుంది. ఒరిజిన ల్ పరికరాల తయారీ సంస్థ ఇలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకోవ డం ఇదే తొలిసారి కావడం గమనార్హం. భారత్‌లో జిఎంఆర్ ఏరోటెక్నిక్స్ కాంప్లెక్స్ మెయింటెనెన్స్, ఆపరేషన్, రిపేర్ సామరం పెంపునకు కూడా బోయింగ్ మద్దతును కొనసాగిస్తుందని కూడా సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

రాబోయే 18 నెలల కాలంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ట్రైనింగ్, సాంకేతికత బదిలీ ద్వారా జిఎంఆర్ సంస్థ సామర్థాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కూడా బోయింగ్ ఆ సంస్థతో కలిసి పని చేస్తుంది. కాగా ఇలాంటి తొలి మార్పిడి విమానం ఎప్పటికి సిద్ధమవుతుందనేది ఈ ప్రాంతంలో విమానయాన సంస్థలయిన బోయింగ్, స్పైస్‌జెట్, బ్లూడార్ట్, క్విక్‌జెట్ సంస్థలనుంచి అందే ప్రధాన ఆర్డర్‌పై ఆధారపడి ఉంటుందని బోయింగ్ ఆ ప్రకటనలో తెలిపింది. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన శుక్రవారం వెలువడే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News