Monday, December 23, 2024

బోయింగ్ 737 విమానం టైర్ పంక్చర్

- Advertisement -
- Advertisement -

టర్కీలో సదరన్ ఎయిర్‌పోర్ట్‌లో బోయింగ్ 737 విమానం ల్యాండ్ అవుతుండగా ఒకటైర్ పంక్చరు కావడంతో అందులోని 190 మందిని సురక్షితంగా కిందకు దించ గలిగారు. టర్కీ రవాణా మంత్రిత్వశాఖ గురువారం ఈ విషయాన్ని వెల్లడించింది. టర్కీకి చెందిన కొరెండాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737800 విమానం గజిపాసా విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తరువాత రన్‌వే పై భద్రంగా అపగలిగారు. ఈ విమానంలో 184 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. జర్మనీ లోని కొలొగ్నే నుంచి ఈ విమానం బయలు దేరింది. విమానం ముందు గేర్ మాత్రమే దెబ్బతిందని టర్కీ రవాణా మంత్రిత్వశాఖ తెలిపింది.రన్‌వే ఏమాత్రం దెబ్బతినలేదని, అయితే విమానాలు సమీపాన గల అంటల్యా విమానాశ్రయానికి మళ్లించినట్టు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News