Friday, January 24, 2025

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా బోగ శ్రావణి

- Advertisement -
- Advertisement -

జగిత్యాలః భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణిని నియమిస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి సహకరించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్, చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్, జిల్లా అధ్యక్షుడు పైడిపెల్లి సత్యనారాయణరావులకు బోగ శ్రావణి కృతజ్ఞతలు తెలిపారు.

రానున్న రోజుల్లో బిజెపి పార్టీని జిల్లాలో మరింత పటిష్టం చేసి, మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని శ్రావణి పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ప్రజల ఆశీస్సులు అందించి బిజెపి జెండా ఎగురవేయాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News