జగిత్యాల: జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ బోగ శ్రావణి బిజెపిలో చేరింది. ఆ సమయంలో ఆమె భర్త ప్రవీణ్ కూడా ఆమెతో ఉన్నారు. ఆమె భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్)కు రాజీనామా చేసిన ఐదు రోజుల తర్వాత బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. న్యూఢిల్లీలో కేంద్ర కార్మిక మంత్రి బూపేందర్ యాదవ్ సమక్షంలో ఆమె బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. శ్రావణి వెంట నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు డికె అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.వివేక్ కూడా ఉన్నారు.
బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్ జగిత్యాలలో ఇటీవల శ్రావణినిన కలిసి తమ పార్టీలోకి ఆహ్వానించారు. శ్రావణి ఇటీవల మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి, బిఆర్‌ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తనను ఎంఎల్‌ఏ సంజయ్ కుమార్ వేధిస్తున్నాడని ఆమె ఇటీవల ఆరోపించారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏ తనను అనేక సార్లు అవమానించారని ఆమె అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. చివరికి ఆమె బిజెపిలో చేరేందుకు నిర్ణయించుకుని చేరిపోయారు.