వాజేడు : ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగత జలపాతం మంగళవారం ఉగ్రరూపం దాల్చింది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా మండలంలో కురుస్తున్న వర్షలతో పాటు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షలతో అటవీ ప్రాంతం గుండా వచ్చే వరద ఉధృతితో బొగత జలపాతం ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తోంది. ఎత్తైన బండలపై నుండి జాలువరుతున్న వరద ఉధృతితో హోరు శబ్ధం చేస్తూ నీటి తుంపర్లు ఎగిసిపడుతున్నాయి.
దీంతో జలపాతం పర్యాటకులను కనువిందు చేస్తోంది. జలపాతం హోయలను, ప్రకృతి అందాలను తిలకించేందుకు భారీగా పర్యాటకులు తరలి వస్తున్నారు. జలపాతం ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తుండటంతో పర్యాటకులు నీటి కొలనులోకి దిగడానికి అనుమతి లేదాని అటవీ అధికారులు తెలిపారు. పర్యాటకులు వరద ఉదృతిని దృష్టిలో పెట్టుకుని వరద ప్రవహంలోకి దిగకూడదని అటవీ శాఖ అధికారులకు సహకరించాలని అటవీ శాఖ సిబ్బంది తెలిపారు.