Saturday, December 21, 2024

శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం వంటగదిలో పేలిన బాయిలర్

- Advertisement -
- Advertisement -

Boiler exploded in Srisailam Mallikarjuna Swamy temples kitchen

మన తెలంగాణ/ అమరావతి: శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం వంటగదిలో మంగళవారంనాడు బాయిలర్ పేలింది. దేవస్థానంలోని అన్నపూర్ణ భవన్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టిఫిన్ తయారీకి ఉపయోగించే వంటగదిలోని స్టీమ్ వాటర్ బాయిలర్ పేలింది. పెద్ద శబ్దంతో పేలుడు చోటుచేసుకోవడంతో అక్కడున్న ఆలయ సిబ్బంది భయాందోళనలతో పరుగులు తీశారు. నిత్య అన్నదానం బయటవైపు ఈ ఘటన జరగడంతో ప్రమాదం తప్పింది. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియలేదు.

కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా శ్రీశైలంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు రావడంతో ఆలయంలోని కంపార్ట్ మెంట్లు, క్యూలైన్లు నిండిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ మొదలయింది. దీంతో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు క్యూలైన్లలో వేచి ఉన్న వారికి వేడి పాలు, ప్రసాదం అందించారు. వీటి ఏర్పాట్లకు ఉపయోగించే వంటగదిలోనే మంగళవారం ఉదయం పేలుడు చోటుచేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News