Friday, January 3, 2025

సిఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బిఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపి బోయినపల్లి వినోద్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లక్ష కోట్ల కాళేశ్వరం కట్టడం, కూల్చడం మన కళ్ల ముందే అని సిఎం మాట్లాడటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. మేడిగడ్డ వద్ద 3 ఫిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరానట్టు సిఎం మాట్లాడుతున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మేడిగడ్డ,అన్నారం,

సుందిళ్ళ కాదు అని పేర్కొన్నారు. కెసిఆర్‌పై కోపంతో సిఎం రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 14 టిఎంసిలతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పేరుతో డిజైన్ చేస్తే …దాని సామర్థ్యాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కెసిఆర్ 141 టిఎంసిలకు పెంచారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతగాక గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై అబాండాలు వేస్తున్నారని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News