Sunday, December 22, 2024

కాంగ్రెస్ వల్లే యువత చాలా నష్టపోయింది

- Advertisement -
- Advertisement -

హనుమకొండ: తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చిందని ఆ పార్టీ నేతలు చెప్పడంపై బిఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బిఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ స్పందించారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్లు గొప్పలు చెబుతున్నారని హనుమకొండలో బిఆర్ఎస్ నేతల మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. 2001 నుంచి 2014 వరకు తెలంగాణ ఇవ్వకుండా జాప్యం చేశారని మండిపడ్డారు. తెలంగాణ ఇవ్వకపోవడం వల్ల యువత చాలా నష్టపోయిందన్నారు. తెలంగాణ విషయమై 2014లో పార్లమెంటులో బిల్లు పెట్టారు. అన్ని పార్టీల మద్దతుతో తెలంగాణ బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చిందని ఆయన గుర్తుచేశారు. అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి బిల్లు ఆమోదింపజేశారని వినోద్ కుమార్  స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News