Sunday, December 22, 2024

మంత్రి ప్రశాంత్ రెడ్డిని పరామర్శించిన బోయినపల్లి వినోద్ కుమార్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ మంగళవారం రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని పరామర్శించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో మంత్రి ప్రశాంత్ రెడ్డిని వినోద్ కుమార్ పరామర్శించారు.

ఆయన తల్లి స్వర్గీయ మంజులమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి తల్లి ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో మెదక్ జిల్లా రామాయంపేట శివారులోని ప్రగతి ధర్మారం గ్రామంలో రాజశేఖర్ రెడ్డిని వినోద్ కుమార్ పరామర్శించారు. ఆయన తల్లి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News