Sunday, December 22, 2024

ఆ పార్టీ టైటిల్‌కు తెలంగాణకు పొందిక లేనే లేదు: వినోద్‌కుమార్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు, తెలంగాణ ప్రాంతానికి పచ్చి వ్యతిరేకి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండల టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వైఎస్‌ఆర్ ఎన్నడు గౌరవించలేదని, అడుగడుగున తెలంగాణకు అడ్డుపడిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణకు అడ్డుపడిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బిడ్డనే షర్మిల అని ఆయన తెలిపారు. షర్మిల పెట్టిన వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ టైటిల్‌కు తెలంగాణకు పొందిక లేనేలేదని ఆయన పేర్కొన్నారు. షర్మిల.. మీ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే అని, తెలంగాణ ఏ మాత్రం కాదని ఆయన స్పష్టం చేశారు.

బీజేపీ వదిలిన కార్యకర్త షర్మిల అని, పచ్చని తెలంగాణ రాష్ట్రంలో చిచ్చు పెట్టేందుకే షర్మిల రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారని ఆయన తెలిపారు. కేంద్రహోం శాఖ మంత్రి అమిత్‌షాతో షర్మిల ఇటీవల భేటీ అయ్యారని, ఆ తర్వాత షర్మిల తెలంగాణపై దాడికి దిగారని ఆయన అన్నారు. దళిత క్రైస్తవుల రిజర్వేషన్స్‌కు వ్యతిరేకి అయిన బీజేపీని నిలదీయాలని, కానీ బీజేపీ కనుసన్నల్లో షర్మిల పని చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ సమాజాన్ని, ప్రజలను మభ్యపెట్టి దెబ్బతీసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని ఆయన అన్నారు. తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకునేందుకు దేశంలోని 36 పార్టీల మద్దతు కూడగట్టుకుని అన్ని వర్గాలను సమీకరించి మహోజ్వల పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఆయన వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News